మార్కెట్లలో రైతులకు న్యాయం జరగాలి

6 Aug, 2015 01:02 IST|Sakshi
మార్కెట్లలో రైతులకు న్యాయం జరగాలి

మంత్రి హరీశ్‌రావు
ఆర్‌కేపురం:
రైతులు, వినియోగదారుల శ్రేయస్సు కోసమే మార్కెటింగ్‌శాఖ పనిచేస్తుందని, రైతు లేనిదే మార్కెట్, కమిషన్ ఏజెంట్లు ఉండరని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఎల్‌బీనగర్ కూరగాయల మార్కెట్‌లో రూ. 2.60 కోట్లతో నిర్మించిన ప్రాంతీయ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ భవనాన్ని మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా  హరీశ్‌రావు మాట్లాడుతూ రైతులకు, ఏజెం ట్లకు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, వారికి న్యాయం జరిగేలా మార్కెటింగ్ శాఖ పని చేయాలన్నారు. మార్కెట్‌లో ఫిర్యాదుల బాక్స్, టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. మార్కెట్‌లో తెల్లచిట్టీలతో వ్యాపారం చేయవద్దని, తక్‌పట్టీలతోనే వ్యా పారం కొనసాగించాలని, ఎలక్ట్రానిక్ వే మిషన్స్ వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్టీఆర్‌నగర్ మార్కెట్‌లో చిరువ్యాపారులకు షెడ్లు కట్టిస్తామని పేర్కొన్నారు. మార్కెట్‌లో సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. 

రాష్ట్రంలో ఉల్లిగడ్డ ధర ఎంత ఉన్నా ప్రభుత్వం భరిస్తుందని, రూ. 20లకు కేజీ ఉల్లిగడ్డ అందిస్తామని పేర్కొన్నారు. నగరంలో 46 సెంటర్లను ఏర్పాటు చేశామని, అవసరమైతే మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్‌లోని పలు కార్మిక సంఘాలు ఏఐటీయూసీ ఇతర సంఘాల నాయకులు వినతిపత్రాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ ఎ.శరత్, సూపరింటెండెంట్ నాగేశ్వర్‌రెడ్డి, మార్కెటింగ్ కమిటీ కార్యదర్శి శాస్త్రి, మల్లేషం, రాంమోహన్‌గౌడ్, మనోహర్‌రెడ్డి, తీగల విక్రమ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఆర్‌కేపురం డివిజన్ పార్టీ అధ్యక్షులు మురుకుంట్ల అరవింద్, బీరెళ్లి వెంకట్‌రెడ్డి, కంచర్ల శేఖర్, పగిళ్ల భూపాల్‌రెడ్డి, తుమ్మల శ్రీరాంరెడ్డి, మహ్మద్, రామాచారి, శ్రీనివాస్, మల్లేష్, మార్కెటింగ్ కమిటీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలుక నర్సింహారెడ్డి, ముకారం పాల్గొన్నారు.

Election 2024

మరిన్ని వార్తలు