నియంతలా న్యాయ వ్యవస్థ: జేపీ

10 Oct, 2016 02:55 IST|Sakshi
నియంతలా న్యాయ వ్యవస్థ: జేపీ

హైదరాబాద్: న్యాయం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అభాగ్యులకు సత్వర న్యా యం అందేలా చూసినప్పుడే న్యాయవాద వృత్తికి సార్ధకత చేకూరుతుందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. సోమాజిగూడలో మినర్వా కాఫీషాప్‌లో ఆది వారం ‘లా స్కూల్101.. క్రిసెండో-2016’ పేరుతో నిర్వహించిన మ్యూట్ కోర్ట్‌లో ఆయన పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థ పని తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తమను తామే న్యాయమూర్తులుగా నియమించుకునే విధానం సరైంది కాదన్నారు.

అత్యున్నత న్యాయవ్యవస్థ నియంతలా వ్యవహరిస్తుందని, ప్రజాస్వామ్యానికి ఇది మంచి ది కాదన్నారు. దేశంలో దాదాపు 3కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వ్యాజ్యాల పరిష్కారంలో సుదీర్ఘ జాప్యం తో వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం న్యాయ విద్యార్థులకు జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాజశేఖర్ గోపాల జోస్యుల, పవన్ కళ్లెం, సత్యేంద్రసింగ్, సునీల్ నీలకంఠన్, శ్లోక, వెన్నల కృష్ణ సహా పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు