రోజాపై చర్యల విషయంలో అంత తొందరెందుకు

5 Mar, 2016 03:46 IST|Sakshi
రోజాపై చర్యల విషయంలో అంత తొందరెందుకు

ప్రివిలేజ్ కమిటీలో ప్రశ్నించిన జ్యోతుల
రోజా అభిప్రాయం తెలుసుకోవాలని కమిటీ నిర్ణయం


సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజాపై చర్య తీసుకునే అంశాన్ని ప్రివిలేజ్ కమిటీ ముందుకు  తీసుకొచ్చే ప్రయత్నం చేయటాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే, ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆక్షేపించారు. శుక్రవారం ఏపీ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశం చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగింది.  శీతాకాల సమావేశాల్లో పరిణామాలపై ఏర్పాటు చేసిన మండలి బుద్ధప్రసాద్ కమిటీ నివేదిక ఈ సమావేశం ముందుకు వచ్చింది.  ఎజెండాలో చేర్చేందుకు అసెంబ్లీ అధికారులు ప్రయత్నించగా జ్యోతుల అభ్యంతరం వ్యక్తం చేశారు.హడావిడిగా రోజా అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. దీంతో ఈ నెల 8న మరోసారి సమావేశమై చర్చించాలని, రోజాను సమావేశానికి పిలిచి ఆమె అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కమిటీ నిర్ణయించింది. శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెలపై గతంలో రోజా చేసిన వ్యాఖ్యల మీద నోటీస్ ఇచ్చిన చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు శుక్రవారం తన వాదన వినిపించారు.

మరిన్ని వార్తలు