'కేంద్రం తీరుపై సీఎం ఆవేదనతో ఉన్నారు'

28 Jun, 2016 11:55 IST|Sakshi
'కేంద్రం తీరుపై సీఎం ఆవేదనతో ఉన్నారు'

హైదరాబాద్ : హైకోర్టు విభజన విషయంల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై సీఎం కేసీఆర్ ఆవేదనతో ఉన్నారని నిజామాబాద్ ఎంపీ కె.కవిత తెలిపారు. అందుకే ఆయన ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద దీక్ష చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నామని కేంద్రప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్లో కె.కవిత విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... హైకోర్టు విభజనపై ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్ పలుమార్లు చర్చించారని కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ప్రక్రియ అంతా కేంద్రంపరిధిలోనే జరగాలన్నారు. క్లాస్ -4 ఎంప్లాయిస్ నుంచి జడ్జిల నియామకం వరకు వివాదం నెలకొని ఉందన్నారు. రేపు జరిగే ఎల్పీ సమావేశంలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

న్యాయాధికారులకు ఆప్షన్ విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కె.కవిత డిమాండ్ చేశారు.  ఇద్దరు జడ్జిలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలన్నారు. కేంద్రం వెంటనే స్పందించి హైకోర్టును విభజించాలన్నాని తెలిపారు. జడ్జిలకు జరిగిన అన్యాయంపై స్పందించాలని ఆమె అన్ని పార్టీలకు సూచించారు. ఇంత జరుగుతున్న విపక్షాలు ఎందుకు మాట్లాడటం లేదని కె.కవిత ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు