9న కమల్‌నాథన్ కమిటీ భేటీ

4 Mar, 2016 02:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ఉద్యోగుల విభజనకు కేంద్రం నియమించిన కమల్‌నాథన్ కమిటీ ఈ నెల 9న సచివాలయంలో భేటీ కానుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కమిటీ ఏర్పడ్డప్పటి నుంచి వరుసగా ఇది 16వ సమావేశం. ఈ నెలాఖరుతో కమిటీ కాల పరిమితి ముగియనుండటంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తం 153 విభాగాలకుగాను 111 విభాగాల్లో విభజన పూర్తయింది. 6 విభాగాల ఉద్యోగుల కేటాయింపు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది.

మరో 32 విభాగాల్లో తాత్కాలిక కేటాయింపులు పూర్తయినప్పటికీ తుది కేటాయింపులకు మరో నెల సమయం పట్టే అవకాశముంది. ప్రధానంగా కమిటీ భేటీలో ఉద్యోగుల విభజన పూర్తి కాని శాఖలపైనే చర్చ జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు