మృతి చెందిన వ్యక్తికి చికిత్స..!

31 May, 2015 00:44 IST|Sakshi

కామినేని ఆస్పత్రిలో బంధువుల ఆందోళన
 మన్సూరాబాద్ : చనిపోయిన వ్యక్తికి కామినేని ఆస్పత్రి వైద్యులు చికిత్స చేసినట్లు రోగి బంధువులు ఆరోపించారు. బంధువుల వివరాలు.. సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన  నాగులంచి శ్రీనివాస్‌రెడ్డి(48) లారీలోని ఐరన్ షీట్లు అన్  లోడ్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు.  వెంటనే ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించారు. అడ్వాన్స్‌గా రూ.75 వేలు చెల్లించారు. రోగికి చికిత్స చేయాలంటే మరో రూ.1.50 లక్షలు చెల్లించాల్సిందిగా ఆస్పత్రి సిబ్బంది చెప్పారు.  అంత మొత్తం తమ వద్ద లేదని, డిశ్చార్జ్ చేస్తే గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్తామని అతడి బంధువులు కోరారు.
 
   ప్రస్తుతం రోగి వెంటిలేటర్‌పై ఉన్నాడని, డిశ్చార్జ్ చేస్తే చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.  అనుమానం వచ్చి కొంత మంది ఐసీయూలోకి వెళ్లి  పరీక్షించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు గమనించారు. ఆస్పత్రి వైద్యులు చనిపోయిన వ్యక్తికి చికిత్స చేస్తున్నట్లు నటిస్తూ తమ నుంచి భారీగా డబ్బులు గుంజేందుకు యత్నించారని ఆరోపిస్తూ వుృతుని భార్య పద్మ, కుమార్తె దివ్య, కుమారుడు సంపత్‌రెడ్డి సహా పలువురు బంధువులు ఆస్పత్రి వుుందు ఆందోళనకు దిగారు. ఈ విషయమై కామినేని ఆసుపత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణను వివరణ కోరేందుకు ‘సాక్షి’ యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

మరిన్ని వార్తలు