కరాటే మాస్టర్ నాగేశ్వరరావు మృతి

22 Nov, 2015 14:56 IST|Sakshi

హైదరాబాద్: భార్య ప్రవర్తనతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకున్న కరాటే మాస్టర్ నాగేశ్వరరావు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  ఆదివారం మృతిచెందాడు.

భార్య సహోద్యోగితో సన్నిహితంగా ఉంటోందని నాగేశ్వరరావు కొంతకాలంగా తీవ్ర మనస్తాపానికి గురైయ్యాడు. భార్య ప్రవర్తనలో మార్పు రాకపోయే సరికి నాలుగు రోజుల క్రితం సెల్ఫీ ద్వారా మరణ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి నాగేశ్వరరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నాగేశ్వరరావు మరణించాడు.
 

మరిన్ని వార్తలు