పాలనను పరుగులు తీయిస్తా:కెసిఆర్

17 Aug, 2014 20:01 IST|Sakshi
కె.చంద్రశేఖర రావు

హైదరాబాద్: మెరికల్లాంటి 35 మంది ఐఏఎస్ అధికారులు దొరికితే పాలనను పరుగులు తీయిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నారు. ఈనెల 19న సింగపూర్‌ వెళ్తున్నానని, వచ్చిన తరువాత  కేబినెట్‌ విస్తరణపై దృష్టి పెడతానని మీడియాతో చిట్‌చాట్‌లో కేసీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఆగదన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికలు కాస్త ఆలస్యం కావొచ్చన్నారు.

 రుణమాఫీపై ఆర్బిఐని ఒప్పిస్తానని చెప్పారు. రుణమాఫీపై ఆటంకాలు ఎదురైతే రైతులకు బాండ్లు ఇస్తామన్నారు. మెట్రో అలైన్‌మెంట్‌లో కొన్ని మార్పులుంటాయని చెప్పారు. అసెంబ్లీ ముందు నుంచి కాకుండా అసెంబ్లీ వెనక నుంచి మెట్రో వెళ్తుందన్నారు. సుల్తాన్‌బజార్‌కు మెట్రో ఎఫెక్ట్‌ ఉండదని కెసిఆర్ చెప్పారు.

మరిన్ని వార్తలు