రోహిత్ మరణంపై కేసీఆర్ స్పందించలేదు

27 Jan, 2016 11:04 IST|Sakshi

హైదరాబాద్ : హెచ్సీయూ వీసీని సస్పెండ్ చేయాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబానికి... సస్పెండ్ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ... వీహెచ్ బుధవారం ట్యాంక్బండ్ వద్ద గంటపాటు మౌన దీక్ష చేపట్టారు. మౌన దీక్ష విరమించిన అనంతరం వీహెచ్ మాట్లాడుతూ.... రోహిత్ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడంపై వీహెచ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ బడుగుల వ్యతిరేకి అని ఈ సందర్భంగా అర్థమైందని అన్నారు.

రోహిత్ మరణానికి ఏబీవీపీ, బీజేపీలే కారణమని వీహెచ్ ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు జోక్యం వల్లే హెచ్సీయూ విద్యార్థులు సస్పెండ్ అయ్యారని విమర్శించారు. రోహిత్ కులంపై చర్చ అనవసరం అని వీహెచ్ అభిప్రాయపడ్డారు. బీఫ్ తినడంపై రాజకీయాలు చేస్తున్నాయని ఎంఐఎం, బీజేపీలపై వీహెచ్ నిప్పులు చెరిగారు.

మరిన్ని వార్తలు