5 కేసీఆర్!

24 Nov, 2014 00:14 IST|Sakshi
5 కేసీఆర్!

లక్ష్యం రూ.5 వేల కోట్లు అనే దాన్ని సంక్షిప్తంగా ఆంగ్లంలో TR (అంటే టార్గెట్) 5K ఇట - ప్రయారిటీ ప్రోగ్రామ్స్.. .. అంటూ పేర్కొన్నారు. దీన్ని సంక్షిప్తంగా వాడుకలో 5 కేసీఆర్‌గా వ్యవహరిస్తున్నారు. 5K Cr అంటే 5000 కోట్లు లక్ష్యమన్నమాట.
 
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం.. గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేస్తాం.. ఇది ప్రభుత్వం తరచూ చెబుతున్న మాట. దాన్ని సాధించాలంటే భారీ ఎత్తున నిధులు అవసరం. నగరానికి సంబంధించినంతవరకు జీహెచ్‌ఎంసీ ఆదాయమే పెద్ద దిక్కు. విశ్వనగరంలో భాగంగా అంతర్జాతీయస్థాయి రాచబాటలు.. నింగినంటే బహుళ అంతస్తుల భవనాలు.. ఆకాశమార్గాల్లో జంక్షన్లు.. తదితర సదుపాయాలు అందుబాటులోకి తేవాలంటే కోట్లాది నిధులు కుమ్మరించాలి. వీటికి నిధులిచ్చేది ప్రభుత్వమే అయినా స్థానిక సంస్థగా వీలైనన్ని నిధులు రాబట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ భావించారు.

ప్రజలపై అదనపు భారం మోపకుండా.. కొత్త పన్నులేవీ విధించకుండా.. ఎక్కువ నిధులు ఎలా సాధ్యమో ఆలోచించారు. ఆయా విభాగాల వారీగా పరిశీలనలు చేసి.. ఏ విభాగం నుంచి ఎన్ని నిధులు వసూలయ్యేందుకు వీలుంటుందో పరిగణనలోకి తీసుకున్నారు.. వాటిపై కసరత్తు చేసి ఒక అంచనాకు వచ్చారు. అన్ని విభాగాల్లోని ఉద్యోగులు ఆదాయమార్గాలపై శ్రద్ధ చూపితే.. కొంత ఎక్కువ కష్టపడితే ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు రూ.5 వేల కోట్లు జీహెచ్‌ఎంసీ ఖజానాకు చేరవచ్చని అంచనా వేశారు. దాన్ని సాధించేందుకు తరచూ అధికారులు, ఉద్యోగులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలంటే ఆయా పన్నులను వసూలు చేయాలని స్పష్టం చేస్తున్నారు.

అందులో భాగంగా ఏయే విభాగాల ద్వారా ఎన్ని నిధులు వచ్చే అవకాశముందో సంక్షిప్తంగా వివరిస్తూ ఒక లేఖ రూపొందించారు. లక్ష్యాన్ని సాధించేందుకుగాను ఆయా విభాగాల ఉన్నతాధికారులకు, జోనల్, డిప్యూటీ కమిషనర్లకు దాన్ని పంపించారు. టార్గెట్‌ను చేరుకోవడంతోపాటు చేపట్టాల్సిన ప్రజాసదుపాయాల గురించీ సదరు లేఖలో పొందుపరిచారు. టార్గెట్‌లో భాగంగా ఆస్తిపన్నుతోపాటు ట్రేడ్ లెసైన్స్ ఫీజులు, ప్రకటనల పన్నులు, వినోదపన్ను, వృత్తిపన్ను, టౌన్‌ప్లానింగ్ ఫీజులు, తదితరమైన వాటిని ప్రస్తావించారు. చేయాల్సిన పనుల్లో స్లమ్ ఫ్రీసిటీ, గ్రీన్ హైదరాబాద్, లేక్ ప్రొటెక్షన్ తదితర కార్యక్రమాల గురించి ప్రస్తావించారు.
 
ఇదండీ 5 కేసీఆర్ కథాకమామిషు
ఆదాయం పెంచుకునేందుకు చేసిన సూచనల్లో కొన్ని..
* జీహెచ్‌ఎంసీ డేటాబేస్ మేరకు ఆస్తిపన్ను జాబితాలో 1.50 లక్షల నివాసేతర(వాణిజ్య) భవనాలున్నాయి. వీటన్నింటికీ ట్రేడ్ లెసైన్సులివ్వడం ద్వారా ఫీజులు వసూలు చేయాలనేది లక్ష్యం. ఇలాంటి భవనాల వారందరికీ నోటీసులిచ్చి ఈనెలాఖరులోగా ట్రేడ్ లెసైన్సులు జారీ చేసి, డిసెంబర్ నెలాఖరులోగా ఫీజులు వసూలు చేయాలనేది యోచన.
* టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ గణాంకాల మేరకు గ్రేటర్‌లో 4.50 లక్షల కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లున్నాయి. అంటే ఇవన్నీ వ్యాపార సంస్థలే. ఇవన్నీ ట్రేడ్ లెసైన్సులు పొందాల్సి ఉందని కమిషనర్ గుర్తించారు. సర్కిళ్ల వారీగా సంబంధిత అధికారులకు ఈ వివరాలందజేయాలని నిర్ణయించారు. వచ్చే జనవరి నెలాఖరులోగా ఇలాంటి వాటన్నింటినుంచి ట్రేడ్‌లెసైన్సు ఫీజు వసూలు చేయాలనేది లక్ష్యం. తద్వారా జీహెచ్‌ఎంసీకి ట్రేడ్ * ప్రకటనల పన్నుల ద్వారా వచ్చే ఆదాయం దాదాపు రూ.25 కోట్లుండగా, ఇది రూ.100 కోట్లు వచ్చే అవకాశముందని అంచనా వేశారు.
* ప్రధాన రహదారుల వెంబడి ఉన్న భవనాలను మరోమారు తనిఖీలు చేసి.. వ్యాపారాలు చేస్తున్నప్పటికీ, నివాస భవనాల జాబితాలోనే ఉన్నవాటిని గుర్తించి వాటికి వాణిజ్య భవనాల కనుగుణంగా ఆస్తిపన్ను విధించాలని భావించారు.
* జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 160 సినిమాహాళ్లున్నాయి. వీటన్నింటి నుంచి 20 శాతం వినోదపన్నుగా జీహెచ్‌ఎంసీకి రావాల్సి ఉంది. కానీ.. ఆక్యుపెన్సీ రేషియో తక్కువ చూపుతూ.. టిక్కెట్ల ధరలను తగ్గించి చూపుతూ వీలైనంత వరకు జీహెచ్‌ఎంసీకి చెల్లించే వాటాలో కోత విధిస్తున్నాయి. వీటిని గాడిలో పెడితే కోట్ల రూపాయల ఆదాయం రాగలదని అంచనా. అలాగే ఇతరత్రా వినోద కేంద్రాలు సైతం లక్షలాదిరూపాయలు ఆర్జిస్తున్నా, జీహెచ్‌ఎంసీకి చెల్లించాల్సిన వినోదపన్నును చెల్లించడం లేదు. అలాంటి వాటన్నింటినీ గుర్తించి, రావాల్సిన పన్నును వసూలు చేస్తే కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.
* ఇలా వివిధ మార్గాల ద్వారా రూ.5 వేల కోట్లు (అంటే 5ఓ ఇట ) లక్ష్యంగా నిర్దేశించడంతోపాటు ఎక్కువ పన్నులు వసూలు చేసే సిబ్బందికి రెట్టింపు ప్రోత్సాహకాలనూ ప్రకటించారు.

మరిన్ని వార్తలు