పంచాయతీరాజ్‌ శాఖపై కేసీఆర్‌ సమీక్ష

20 Mar, 2016 19:01 IST|Sakshi

హైదరాబాద్‌: గ్రామ పంచాయతీలను పటిష్టం చేసేందుకు అవసరమైతే కొత్త చట్టం తేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఆదివారం పంచాయతీరాజ్‌ శాఖఫై కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామాల బాగోగుల బాధ్యత గ్రామ పంచాయతీలదేనని కేసీఆర్‌ అన్నారు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా చెత్త సేకరణ కోసం 25 వేల సైకిల్‌ రిక్షాల పంపిణీ చేయనున్నట్టు సీఎం వెల్లడించారు.

మరిన్ని వార్తలు