ఎయిర్‌పోర్ట్‌లో కేజీ బంగారం స్వాధీనం

29 Apr, 2017 00:38 IST|Sakshi
ఎయిర్‌పోర్ట్‌లో కేజీ బంగారం స్వాధీనం

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులు శుక్రవారం ముగ్గురు వ్యక్తుల నుంచి 1.23 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అమెరికా, అబుదాబి నుంచి వచ్చి న ఈ ముగ్గురిని కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న బంగా రం విలువ మార్కెట్‌లో రూ. 36.09 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. పసిడిని రవాణా చేసిన విధానం, తీసుకువచ్చిన ప్యాసింజర్ల ప్రొఫైలింగ్‌ ఆధారంగా ఇది వ్యవస్థీకృత స్మగ్లింగ్‌ కాకపోవచ్చని, వ్యక్తిగత అవసరాల కోసమే తెచ్చుకుని ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా నుంచి అబుదాబి మీదుగా వచ్చే విమానం లో శంషాబాద్‌ చేరుకున్న ఓ వ్యక్తి 342 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని 8 కడియాల రూపంలో తీసుకువచ్చాడు. అబుదాబి నుంచి వచ్చిన విమానంలో దిగిన ఇద్దరిలో ఒకరు 387 గ్రాముల బంగారాన్ని రెండు గొలుసుల రూపంలోనూ, మరొకరు 507 గ్రాముల బంగారాన్ని గాజుల రూపంలోనూ తీసుకొచ్చారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు