ఈ ఏడు గణేషుడు ఇలా..

2 Jul, 2016 17:45 IST|Sakshi

హైదరాబాద్ : దక్షిణ భారతదేశంలో అతిపెద్ద వినాయకుడిగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ గణేషుడు వినాయక చవతికి సిద్ధమవుతున్నాడు. ఈ సారి 'శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి' గా పార్వతీ పుత్రుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. దీనికి సంబంధించిన చిత్రాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు శనివారం విడుదల చేశారు. గణపతి విగ్రహానికి కుడిచేతి వైపు తిరుమల వేంకటేశ్వరస్వామి, ఎడమచేయి వైపు గోవర్ధన గిరిధారియైన శ్రీకృష్ణుడి విగ్రాహాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నిర్మించనున్నట్లు విగ్రహ కమిటీ తెలిపింది.

మరిన్ని వార్తలు