వరి నాట్లు 32 శాతమే

4 Aug, 2016 02:04 IST|Sakshi

ఖరీఫ్‌లో వరి సాగుపై వ్యవసాయ శాఖ నివేదిక వెల్లడి
 

హైదరాబాద్: రాష్ట్రంలో ఇతర పంటల సాగు ఆశాజనకంగా ఉన్నా వరి నాట్లు మాత్రం వెనుకబడే ఉన్నాయి.  వ్యవసాయ  శాఖ బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో వరి నాట్లు 32 శాతానికే పరిమితమయ్యాయి. వరి సాగు సాధారణ విస్తీర్ణం 24.35 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 7.78 లక్షల ఎకరాల్లో(32%) మాత్రమే నాట్లు పడ్డాయి. ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.07 కోట్ల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 77.53 లక్షల ఎకరాల్లో(72%) సాగయ్యాయి.

అందులో పప్పుధాన్యాల సాగు మాత్రం భారీగా పెరిగింది. వాటి సాధారణ సాగు విస్తీర్ణం 9.97 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 14.17 లక్షల ఎకరాల్లో(142%) సాగయినట్లు నివేదిక వెల్లడించింది. అలాగే మొక్కజొన్న 110 శాతం, కంది 148 శాతం, పెసర 131 శాతం, మినుములు 139 శాతం అధికంగా సాగయ్యాయి. పత్తి 29.17 లక్షల ఎకరాల్లో, సోయాబీన్ 7.33 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి.
 
 

whatsapp channel

మరిన్ని వార్తలు