అంత్యోదయ’కు సబ్సిడీపై కిలో చక్కెర!

25 May, 2017 01:39 IST|Sakshi
అంత్యోదయ’కు సబ్సిడీపై కిలో చక్కెర!

జూన్‌ నుంచి అమలుకు ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: రేషన్‌ షాపుల ద్వారా అంత్యోదయ ఆహార భద్రత కార్డు (ఏఎఫ్‌ ఎస్‌సీ) కలిగిన వారికి జూన్‌ నుంచి సబ్సిడీ ధరపై కిలో చక్కెర పంపిణీ జరుగనుంది. ఈమేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమి షనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే చక్కెరకు సబ్సిడీ ఎత్తివేసి కేవలం అంత్యో దయ అన్నయోజన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే  సబ్సిడీ చక్కెర సరఫరా నిలిచిపోగా, గోదా ముల్లో ఉన్న పాత స్టాక్, డీలర్ల వద్ద  మిగులు నిల్వలను మే నెలలో కొంత వరకు పంపిణీ చేశారు. ఇక ఆహార భద్రత కార్డుదారులకు సబ్సిడీపై చక్కెర పంపిణీ పూర్తిగా నిలిపివేశారు.

సబ్సిడీపై కిలో చక్కెర రూ. 13.50..
అంత్యోదయ ఆహార భద్రత కార్డుదారులకు సబ్సిడీపై కిలో చక్కెర రూ.13.50కు లభించనుంది. రాష్ట్రంలో మొత్తం 85,72,859 ఆహార భద్రత కార్డుదారులు ఉండగా అందులో అంత్యోదయ ఆహార భద్రత కార్డుదారులు 5,54,127 వరకు ఉన్నారు. ఇప్పటివరకు ఆహార భద్రత, అంత్యోదయ కార్డుదారులందరికీ సబ్సిడీ ధరపై అర కిలో చక్కెర పంపిణీ జరిగేది. కేంద్ర ప్రభుత్వం చక్కెరపై సబ్సిడీ ఎత్తివేసి, కేవలం అంత్యోదయ కార్డులకు మాత్రమే సబ్సిడీపై పంపిణీ చేయాలని సూచించింది. ఒక్కో కార్డుపై మరో అర కిలో కోటాను పెంచి ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు