ఎవరి జాగీరని భూమి తీసుకుంటారు?

3 Aug, 2015 01:26 IST|Sakshi
ఎవరి జాగీరని భూమి తీసుకుంటారు?

జవహర్‌నగర్:  అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసిన పాపానికి జవహర్‌నగర్‌వాసులను రోడ్డున పడేస్తారా.. అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం రంగారెడ్జి జిల్లా జవహర్‌నగర్‌లో ఇటీవల కూల్చేసిన ఇళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. ‘ఆ ఇళ్లు  ఆడపిల్ల వస్తే బట్టలు మార్చుకోవడానికీ వీలులేకుండా ఉన్నాయి. మీరు నాకు ఓటు వేయండి డబుల్ బెడ్‌రూమ్ కట్టిస్తానని ఎన్నికల ముందు కేసీఆర్ మాయమాటలు చెప్పి..

ఇప్పుడు ఉన్న ఒక గదిని కూడా తొలగించాలనుకోవడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని చెప్పారు. బీజేపీ శాసనసభా పక్షనేత కె.లక్ష్మణ్ మాట్లాడుతూ జవహర్‌నగర్ పేదలకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు