ముందు ఐఐటీ ముంబై.. ఆ తర్వాత సివిల్స్

27 May, 2016 03:26 IST|Sakshi
ముందు ఐఐటీ ముంబై.. ఆ తర్వాత సివిల్స్

ఇంజనీరింగ్ టాపర్ సాయితేజ
హైదరాబాద్: ‘నా తొలి లక్ష్యం ఐఐటీ ముంబైలో సీటు సాధించడమే. ఆ తర్వాత సివి ల్స్ టాపర్‌గా నిలవాలనుకుంటున్నా’ - ఇదీ తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో 160 మార్కులకు 160 మార్కులు సాధించిన ఇంజనీరింగ్ టాపర్‌తాళ్లూరి సాయితేజ మనోగతం. చదువుల తల్లి ముద్దుబిడ్డసాయి ఏపీ ఎంసెట్‌లోనూ ఏడో ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే. ఐఐటీ జేఈఈలోనూ 345 మార్కులతో ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. జేఈఈ అడ్వాన్స్‌లోనూ 300కు పైగా మార్కులు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తండ్రే తనకు ఆదర్శమంటున్న సాయి, రోజూ ఉదయం ఆరింటి నుంచి రాత్రి 10.30 దాకా చదువుపైనే దృష్టి పెట్టానని వివరించాడు.

సివిల్స్‌లో ర్యాంక్ సాధించి ప్రజలకు నేరుగా మెరుగైన సేవలందించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. జూనియర్ సైన్స్-2014లో గోల్డ్‌మెడల్ సాధించిన సాయి ప్రస్తుతం ముంబైలో జాతీయ స్థాయి ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో పాల్గొంటున్నాడు. సాయితేజ స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కూచిపూడి. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తండ్రి చలపతిరావు భవన నిర్మాణ రంగంలో ఉన్నారు. తన కుమారుడు సివిల్ సర్వెంట్‌గా సేవలందిస్తే చూడాలని ఉందని ఆయన చెప్పారు. లేదంటే సొంతంగా ఐటీ కంపెనీ స్థాపించి యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు