అది ‘రియల్‌’ కుట్ర!

24 May, 2017 03:54 IST|Sakshi
అది ‘రియల్‌’ కుట్ర!

ధర్నాచౌక్, సచివాలయం తరలింపుపై కోదండరాం

సాక్షి, హైదరాబాద్‌: ధర్నాచౌక్, సచివాలయం తరలింపు వెనుక రియల్‌ఎస్టేట్‌ వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయన్న అనుమానం కలుగుతోందని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం వ్యాఖ్యా నించారు. ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ కన్వీ నర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నేతృత్వంలో కమిటీ సమావేశం మఖ్దూం భవన్‌లో మంగళవారం జరిగింది. తమ్మినేని వీరభద్రం, డి.జి.నర్సింహారావు (సీపీఎం), మల్లేపల్లి ఆదిరెడ్డి (సీపీఐ), వేము లపల్లి వెంకట్రామయ్య, హనుమేశ్‌ (సీపీఐ ఎంఎల్‌ –న్యూడెమొక్రసీ), కె.గోవర్దన్‌ (న్యూడె మోక్రసీ), రవిచంద్ర, నలమాస కృష్ణ (టీపీ ఎఫ్‌), భూతం వీరన్న (సీపీఐ– ఎంఎల్‌), తాండ్ర కుమార్, ఉపేందర్‌రెడ్డి (ఎంసీపీఐ– యూ), జె.జానకిరాములు (ఆర్‌ఎస్‌పీ), గాదె ఇన్నయ్య (తెలంగాణ ప్రజా వేదిక), సజయ పాల్గొన్నారు.

వ్యాపారుల కోసమే..!
సమావేశం అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ... ధర్నా చౌక్‌ చుట్టూ ఉన్న స్థానిక బస్తీలను ఎత్తివేసి, హుస్సేన్‌సాగర్‌ చుట్టూ వ్యాపార కేంద్రంగా మార్చే యత్నం జరుగుతున్నట్టు సమాచారం ఉందన్నారు. ధర్నాచౌక్, సచి వాలయం తరలింపు ద్వారా ప్రజల సమిష్టి ఆస్తులను ఒకరిద్దరు వ్యాపా రులకు తాకట్టుపెట్టే ప్రయత్నాలు జరు గుతు న్నాయన్నారు. సచివాలయాన్ని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్మించ డంపై అక్కడి వాకర్స్‌ అసోసియేషన్‌ వ్యతి రేకిస్తూ తీర్మానించిందని కోదండరాం వెల్లడించారు.

28న పాదయాత్ర...
ధర్నాచౌక్‌ పరిరక్షణ ఉద్యమం కొనసాగిం పుగా ఈ నెల 28న ఇందిరాపార్కు పరిసర బస్తీల్లో పాదయాత్రలు నిర్వహి స్తామని చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. 

మరిన్ని వార్తలు