కోమటిరెడ్డి వర్సెస్ జగదీశ్‌రెడ్డి

13 Mar, 2016 03:59 IST|Sakshi
కోమటిరెడ్డి వర్సెస్ జగదీశ్‌రెడ్డి

♦ నల్లగొండలో పరిస్థితిపై మండలిలో వాగ్వాదం
♦ జిల్లాల్లో రాజకీయం రౌడీల చేతికి వెళ్లిందన్న రాజగోపాల్‌రెడ్డి
♦ టికెట్లు కొనుక్కొని రాజకీయాలు చేస్తున్నారన్న మంత్రి జగదీశ్
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘శాంతిభద్రతలు అంటే ఒక్క హైదరాబాద్‌లోనే కాదు. జిల్లాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రౌడీయిజం సాగించారు. సీఎం సహా నేతలంతా గెలుపు కో సం ఎంతకైనా తెగించమని ఆదేశించారు. నల్లగొం డ రాజకీయం రౌడీల చేతుల్లోకి వెళ్లింది..’’ అంటూ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శనివారం  మండలిలో చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారి తీశాయి. దీనిపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పందిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా మా ట్లాడవద్దంటూ హితవు పలికారు. టీఆర్‌ఎస్‌కు ప్రజ లు అనుకూల తీర్పునిచ్చారని, ప్రజా తీర్పును జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు.

సభలో ఉన్న నల్లగొండ జిల్లాకే చెందిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు. ‘‘పైసలు పెట్టి టికె ట్లు కొనుక్కొని కొందరు రాజకీయాల్లోకి వచ్చారు. పైసలతో ఏమైనా చేయొచ్చని భావించారు. రాజకీ య వ్యభిచారం చేస్తున్నారు. జిల్లాలో అరాచకం చే సిన విస్నూర్ రాంచంద్రారెడ్డి వారసులుగా కొం ద రు తయారయ్యారు. అదే సమయంలో రావి నారాయణరెడ్డి వంటి వారి వారసులు కూడా ఉన్నారు. నల్లగొండ జిల్లాలో ఒక్క రాజకీయ కేసు నమోదు కాలే దు. కొందరి వల్ల జిల్లా కలుషితం అయింది’’ అని అన్నారు. దీనిపై రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.

మా సోదరులం (కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజ గోపాల్‌రెడ్డి) వ్యాపారం చేసుకొని రాజకీయం చేస్తున్నాం. దొంగనోట్లు, ఇసుక దందాలు, అక్రమాలకు పాల్ప డే వారు కొందరు జిల్లాలో రాజకీయం చేస్తున్నారు. తాను ఎంపీగా ఉండి ఢిల్లీలో తెలంగాణ కో సం పోరాడితే మా అన్న మంత్రి పదవికి రాజీనా మా చేశాడు. తెలంగాణ పోరాటంతో సంబంధం లేని వాళ్లం కాదు.  మా నల్లగొండ జిల్లాలో రౌడీలే రాజ్యమేలుతున్నారు..’’ అని ఆవేశంగా అన్నారు. దీంతో కడియం జోక్యం చేసుకుంటూ.. ప్రజాతీ ర్పుతో అధికారంలోకి వచ్చిన పార్టీని పట్టుకొని రౌ డీలు రాజ్యమేలుతున్నారు అనడం మంచిది కాదు. మనల్ని మనమే కించపరుచుకోవద్దు’’ అన్నారు. రౌడీలు అనే పదాన్ని ఉపసంహరించుకోవాలని ఆ దేశించాల్సిందిగా చైర్మన్ స్వామిగౌడ్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో చైర్మన్ స్పందిస్తూ... నల్లగొండను ఆంగ్లేయులు పాలించడం లేదని, ఈ ప్రభుత్వమే న డుపుతోందన్నారు. రౌడీలు అన్న పదాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. దీంతో ఆ పదాన్ని ఉప సంహరించుకున్నట్లు రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా