రైతులపై సీఎం కక్షపూరిత ధోరణి

3 Oct, 2016 00:43 IST|Sakshi
రైతులపై సీఎం కక్షపూరిత ధోరణి

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి
కూసుమంచి: ‘రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం ముందుకు సాగవు.. అని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. కానీ, ఆయన మాత్రం రైతాంగం పట్ల కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపంలోని ధర్మాతండా వద్ద వర్షాలకు దెబ్బతిన్న పత్తిచేలను ఆయన పరిశీలించారు. గిరిజన రైతులు జర్పుల కృష్ణ, శివతో మాట్లాడారు. పత్తికి పెట్టిన పెట్టుబడి, వచ్చే ఆదాయాన్ని అడిగి తెలుసుకున్నారు.

‘ఈ ఏడాది పంటలు బాగాలేవు. కల్తీ విత్తనాలు, వర్షాలతో దెబ్బతిన్నాయి. పంటలు పోతుంటే ఏ మంత్రి, అధికారి కూడా వచ్చి చూడటం లేదు’ అని వాపోయారు. తెలంగాణ వస్తే తమ కష్టాలు పోతాయనుకున్న రైతులకు కష్టాలే మిగులుతున్నాయని ఈ సందర్భంగా కొండా రాఘవరెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు