పగిలిన కృష్ణా పైప్‌ లైన్

7 Oct, 2015 18:23 IST|Sakshi
పగిలిన కృష్ణా పైప్‌ లైన్

బాలాపూర్ చౌరస్తాలో ఉన్న కృష్ణా పైప్‌లైన్ ఫేజ్-2 రింగ్‌మెన్ వన్ జాయింట్ బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగి పేలిపోడంతో ప్రధాన రహదారిపై నీరు ఏరులై పారింది.  ఆకస్మికంగా చోటు చేసుకున్న ఈ సంఘటనతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. రహదారి పై ప్రయాణిస్తున్నవాహనాలు.. నీటి ఉధృతికి కొట్టుకు పోయాయి. చుట్టుపక్కల దుకాణాలు నీట మునిగాయి.


కాగా.. వత్తిడి కారణంగానే బాలాపూర్ చౌరస్తాలో కృష్ణా ఫేజ్ 2 పైప్ లైన్ పగిలి పోయిందని.. జలమండలి అధికారులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు సాహెబ్‌నగర్‌కు అనుసంధానంగా ఉన్న ప్రధాన కంట్రోల్‌వాల్‌ను ఆపివేశామని.. అయితే అప్పటికే పైప్‌గుండా సరఫరా అవుతున్న నీరు లీక్‌కావడంతో ఈఘటన చోటు చేసుకుందన్నారు. కంట్రోల్ వాల్వ్ ఆపడంతో బాలాపూర్, బార్కాస్ సబ్‌డివిజన్‌లకు నీటిసరఫరాలో అంతరాయం ఉంటుందని వివరించారు.


 పైప్ లైన్ నుంచి భారీగా నీరు రావడంతో.. రహదారిపై రెండు గంటల పాటు రాకపోకలు స్తంభించాయి. ట్రాఫిక్ పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు.
 

మరిన్ని వార్తలు