పదెకరాల చొప్పున కేటాయించండి

2 Jan, 2018 02:54 IST|Sakshi

సీఎం కేసీఆర్‌కు కృష్ణయ్య బహిరంగ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 66 బీసీ కులసంఘాల్లో ఒక్కో కులానికి 10 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఈ కులాలకు హాస్టళ్లు, కమ్యూ నిటీ భవనాలు కట్టుకోవడానికి స్థలం, బడ్జెట్‌ కేటాయిస్తే అన్ని కులాలను ఆదుకున్నట్లు అవుతుందని, కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే రాని కులాలకు అన్యాయం చేసిన వారవుతారని పేర్కొన్నారు.

ఈ మేరకు సోమవారం సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు బహిరంగలేఖ రాశారు. పూసల, జంగం, లింగాయత్, వీర భద్రియ, భట్రాజు, ఆరెకటిక, గాండ్ల, వంజరి, వంశీరాజ్, వాల్మీకి, పూసల, తమ్మలి, వారాల తదితర 66 కులాలకు అలాగే మాల, మాదిగ, లంబాడి, ఎరుకల, యానాది, గోండు తదితర ఈబీసీ కులాలకు 10 ఎకరాల స్థలం, రూ. 10 కోట్ల చొప్పున కేటాయించాలని కోరారు.

మరిన్ని వార్తలు