కొల్లూరులో ‘డబుల్‌’ టౌన్‌షిప్‌!

30 Mar, 2018 03:05 IST|Sakshi

15,600 డబుల్‌ బెడ్రూం ఇళ్లతో నిర్మాణం

మండలిలో మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: డబుల్‌బెడ్రూం ఇళ్ల పథకం కింద హైదరాబాద్‌ శివారులోని కొల్లూరులో పెద్ద టౌన్‌షిప్‌ నిర్మించనున్నట్లు పురపాలక మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో మౌలిక సదుపాయాలతో 15,600 డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు.

దాదాపు 75 వేల జనా భా నివసించేందుకు అనువుగా పాఠశాల, ఆస్పత్రి, పోలీస్‌ స్టేషన్, ఫైర్‌ స్టేషన్, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు తదితర సదుపాయాలు కల్పిస్తామన్నారు. దీంతో ఈ టౌన్‌షిప్‌ కొత్త పురపాలికగా రూపుదిద్దుకుం టుందని చెప్పారు. గురువారం శాసనమండలి ప్రశ్నోత్తరా ల్లో బీజేపీ సభ్యుడు ప్రభాకర్‌ అడిగిన ప్రశ్నకు కేటీఆర్‌ సమాధానమిచ్చారు.

రాజధానిలో 1,492 మురికివాడలు..
హైదరాబాద్‌లో 1,492 మురికివాడలున్నాయని, వాటిల్లో నివాసముండే పేదలకు అక్కడే డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు.  జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ జోన్‌ కార్యాలయంలోని 204 నంబర్‌ గదిలో జరిగిన అగ్నిప్రమాదం వెనుక కారణాలపై సైఫాబాద్‌ పోలీసులు విచారణ జరుపుతున్నారని కేటీఆర్‌ చెప్పారు.

ఈ కార్యాలయం పరిధిలో జరిగిన మురికి కాల్వల్లో పూడికతీత పనుల్లో రూ.కోటి వరకు అక్రమాలు జరిగాయని అంతర్గత ఆడిట్‌లో తేలిందని, బాధ్యులైన 14 మంది ఇంజనీర్లను సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు.

కుంభకోణం వెలుగులోకి రాకుండా కావాలనే కొందరు బిల్లులను కాల్చేశారని ఎంఎస్‌ ప్రభాకర్‌ అడిగిన ప్రశ్నకు కేటీఆర్‌ సమాధానమిచ్చారు. గురుకుల పాఠశా లల్లో ఉద్యోగులు ఆంగ్లంలో మాట్లాడకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని  జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరిం చుకోవాలని టీఆర్‌ఎస్‌ సభ్యుడు సుధాకర్‌రెడ్డి చేసిన డిమాండ్‌ను ఎస్సీ అభివృద్ధి మంత్రి జగదీశ్‌రెడ్డి తోసిపుచ్చా రు. హెచ్చరికలను ఉత్తర్వుల నుంచి తొలగిస్తామన్నారు.

మరిన్ని వార్తలు