మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఐకాన్గా కేటీఆర్ ఎంపిక

3 Dec, 2015 20:41 IST|Sakshi
మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఐకాన్గా కేటీఆర్ ఎంపిక

హైదరాబాద్ : ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు మరోసారి జాతీయా స్ధాయి గౌరవం దక్కింది. దక్షిణ భారత దేశంలో అతి పెద్ద లైఫ్ స్టయిల్ మ్యాగజైన్ రిట్జ్-సీఎన్ఎన్ ఐబీఎన్లు లు కలిసి కేటీఆర్కు మోస్ట్  ఇన్స్పిరేషనల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ (Most Inspirational Icon of the Year)  అవార్డుని ప్రకటించింది. ప్రముఖ వార్త చానల్ సీఎన్ఎన్ ఐబీఎన్ తో కలిసి నిర్వహిస్తున్న ఆడి రిట్జ్ ఐకాన్ అవార్డ్స్ 2015గాను ఈ అవార్డుని ప్రదానం చేయనుంది.  డిసెంబర్ 13న బెంగళూరులో జరగనుంది.  ప్రజాజీవితంలో అద్భుతమైన పురోగతి సాధించినందుకు గాను ఈ అవార్డుకి ఎంపిక చేసినట్టు రిడ్జ్ మ్యాగజైన్ తెలిపింది.  

తనదైన పరిపాలనా పద్దతులు, అలోచన విధానంతో తెలంగాణ ప్రజలకి అందిస్తున్న సేవలను గుర్తించినట్టు, పరిపాలనలో ఉన్నత ప్రమాణాలు నిలిపేందుకు కృషి చేస్తున్న తెలివైన నాయకుడని కేటీఆర్ను జ్యూరీ అభినందించింది. ప్రజల అవసరాలపైన అపారమైన జ్ఞానం ఉన్న కొత్తతరం రాజకీయ నాయకుడిగా పేర్కొంది. ఈ మేరకు మంత్రిని ప్రత్యేకంగా అభినందింస్తూ ఈ -మెయిల్ని పంపింది. త్వరలోనే సంస్ధ సీనియర్ ప్రతినిధి బృందం స్వయంగా మంత్రిని కలిసి అవార్డు కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు తెలిపింది.

మంత్రి కె.తారక రామారావుతోపాటు పలువురి ప్రముఖులకి ఆయా రంగాల్లో అవార్డులను ప్రకటించింది. వ్యాపారం రంగంలో గ్రంధి మల్లిఖార్జునరావు, తెలుగు చలన చిత్ర రంగంలో రాంచరణ్, గౌరంగ్ షాకి ప్యాషన్, నందన్ నిలేకనీకి సాంకేతిక రంగంతోపాటు విద్యాబాలన్కి సినిమా విభాగాలకు అవార్డులను ప్రకటించింది. తనకి అవార్డు ప్రకటించడం పట్ల ఐటి శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు అన్ని రంగాల్లో ముందుకు వెళుతూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి గుర్తింపని కేటీఆర్ తెలిపారు.

మరిన్ని వార్తలు