భూసేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం

30 Apr, 2017 15:15 IST|Sakshi
భూసేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ, శాసనమండలిలలో భూసేకరణ చట్టసవరణ బిల్లు ఆమోదం పొందింది. శాసనసభలో విపక్షాల ఆందోళనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే కేవలం పది నిమిషాల్లో చట్ట సవరణ బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక శాసనమండలి మూడు నిమిషాల్లోనే ముగిసింది.

ఆదివారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ భూసేకరణ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే.. సభ ప్రారంభం కాగానే రాష్ట్రంలో రైతు సమస్యలపై చర్చకు కాంగ్రెస్‌ పార్టీ పట్టుబట్టింది. స్పీకర్‌ పోడియం వద్ద కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన చేపట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండానే ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభను స్పీకర్‌ నిరవధికంగా వాయిదా వేవారు. కీలకమైన బిల్లు విషయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వాయిదా అనంతరం కూడా కాంగ్రెస్‌ సభ్యులు సభలోనే ఉండి నిరసన కొనసాగించారు.

మరిన్ని వార్తలు