వీరేషా... అతనెవరు?

20 Mar, 2016 03:44 IST|Sakshi
వీరేషా... అతనెవరు?

ప్రశ్నిస్తున్న హరినగర్ వాసులు
సోదాలు చేసిన నగర పోలీసులు

 
సిటీబ్యూరో:  షాహినాయత్‌గంజ్ పోలీసుస్టేషన్ పరిధి నుంచి పదో తరగతి విద్యార్థి అభయ్‌ను కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చిన కేసులో ముషీరాబాద్ పరిధిలోని హరినగర్ తెరపైకి వచ్చింది. ఈ ఉదంతంలో కిడ్నాపర్లు అభయ్ తండ్రి రాజ్‌కుమార్‌కు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేయడానికి ‘7842276480’ ఫోన్ నెంబర్ వాడారు. టాటా డొకోమోకు చెందిన ఈ నెంబర్ ‘బి.వీరేష్, 1-7-1022/8/9/బీ, హరినగర్, నియర్ పోచమ్మ టెంపుల్, రామ్‌నగర్, ముషీరాబాద్’ చిరునామాతో రిజిస్టర్ అయి ఉంది. దీంతో ‘సాక్షి’ ఆ ఇంటికి వెళ్లి వీరేష్ కోసం ఆరా తీసింది. ఈ నేపథ్యంలోనే ఇంటి యజమానితో పాటు చుట్టుపక్కల వాళ్లు సైతం అలాంటి పేరు గల వ్యక్తులు ఎవరూ ఇక్కడ లేరని, గతంలోనూ నివసించలేదని స్పష్టం చేశారు. బుధవారం రాత్రి నగర పోలీసులు సైతం వచ్చి సోదాలు చేసి వెళ్లారని వివరించారు. దీంతో కిడ్నాపరుల తప్పుడు వివరాలతో సిమ్‌కార్డు తీసుకుని ఉంటారని పోలీసులు చెప్తున్నారు.

సిమ్‌కార్డ్ ఔట్‌లెట్స్‌పై దాడులు...
అభయ్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు ఈ కుట్రను అమలు చేయడానికి బోగస్ వివరాలతో తీసుకున్న సిమ్‌కార్డులు వినియోగించినట్లు తేలింది. ఇలాంటి సిమ్‌కార్డుల్ని ఎక్కువ ధరకు విక్రయిస్తున్న దుకాణాలతో పాటు నిందితులు సిమ్స్ ఖరీదు చేసిన దుకాణాన్నీ పోలీసుల గుర్తించారు. దీంతో నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి సికింద్రాబాద్‌లోని కొన్ని దుకాణాలపై దాడులు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరిలో దుండగులకు సిమ్‌కార్డులు అమ్మిన వారు ఎవరనేది ఆరా తీస్తున్నారు.
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తెలంగాణ యోధుడు రాంరెడ్డి కన్నుమూత

హై హై.. ఐటీ ఆఫర్‌ కోటి!

రేపు శ్రీశైలానికి కృష్ణా జలాలు

వరద పెరిగె.. పంపింగ్‌ ఆగె..

ముఖేశ్‌గౌడ్‌కు కన్నీటి వీడ్కోలు

నేడు బోధనాసుపత్రుల బంద్‌

పేల్చి.. కూల్చేద్దాం!

నేషనల్‌ పూల్‌లో మిగిలిన ఎంబీబీఎస్‌ సీట్లు 67

మొక్కల్ని బతికించండి

కిడ్నాప్‌ కథ సుఖాంతం

మహా సుదర్శన యాగం 

రేపటి నుంచి ఇంజనీరింగ్‌ తరగతులు

సంప్రదాయసాగుపై అ‘సెస్‌’మెంట్‌ 

ఎర్రమంజిల్‌ భవనం కూల్చివేతపై స్టే ఇవ్వండి

టీఆర్‌ఎస్‌ను ఓడించేది మేమే

అయినవారే ‘అదృశ్య’శక్తులు! 

భార్య పుట్టింట్లోనే ఉండటంతో...

అరిస్తే చంపేస్తానని బెదిరించాడు..

ఫేస్‌బుక్‌ ప్రేమ; రూ.11 లక్షలు గోవిందా..!

వ్యాపారి గజేంద్ర కిడ్నాప్‌ మిస్టరీ వీడింది

ఫ్రెండ్‌షిప్‌ డేకు ‘హాయ్‌’ రెస్టారెంట్‌ ఆఫర్లు

తల్వార్‌తో రౌడీషీటర్‌ వీరంగం

నాడు అలా.. నేడు ఇలా..

ఎట్టకేలకు పోలీసుకు చిక్కిన రవిశేఖర్‌

అనుమానాస్పద స్థితిలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ మృతి

కాంబో కథ కంచికేనా?

నిరసన ఉద్రిక్తం

మాస్‌ లీడర్‌ ముఖేష్‌గౌడ్‌

కంప్లైంట్ ఈజీ..!

పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఆ సమస్య ఎక్కువ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

800లో భాగస్వామ్యం

తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి

నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే...

బిగ్‌బాస్‌ హౌస్‌లో వంటగ్యాస్‌, నీళ్లు కట్‌

‘ప్రేమ చూపిస్తున్నారా.. దాడి చేస్తున్నారా?’