హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం..

27 Sep, 2016 06:50 IST|Sakshi

హైదరాబాద్‌: వరద ప్రభావం నుంచి నగర వాసులు ఇంకా తేరుకోనేలేదు. ఇప్పటికే భారీ వర్షాలతో అతులాకుతలమైన హైదరాబాద్‌ నగరం.. ఇప్పుడెప్పుడే నెమ్మదిగా కోలుకుంటోంది.  భారీ వర్షాలతో బీభత్సం సృష్టించి.. ఏదో కొంత తెరపి ఇచ్చింది కదా అనుకుంటే మళ్లీ వర్షం మొదలైంది.  సోమవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఓ  మోస్తరుగా వర్షం పడుతోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురియడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుమలగిరిలో వర్షం కురుస్తోంది. 

లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా, రోడ్లన్నీ చెరువులను తలపించాయి. వర్షం ధాటికి ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిజాంపేట వంటి లోతట్టు ప్రాంతాలలో వరద ప్రభావం నుంచి అక్కడి ప్రాంత వాసులు ఇంకా తేరుకోనేలేదు. మళ్లీ వర్షం పడుతుండటంతో నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు