వేలానికి వేళాయే!

17 Nov, 2014 01:36 IST|Sakshi
వేలానికి వేళాయే!

* ఆ జాబితాలో 3,500 ఎకరాలు హెచ్‌ఎండీఏ భూములు?
* రూ.6,500 కోట్ల సమీకరణకు సర్కార్ యోచన
* నగర శివార్లలో ‘రియల్’కు పూర్వ వైభవం

సాక్షి, సిటీబ్యూరో: రాజధాని నగరానికి సమీపంలోని ప్రభుత్వ భూముల విక్రయానికి రంగం సిద్ధమవుతోంది. వివిధ విభాగాల వద్ద నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల లెక్కతేల్చిన సర్కార్... వాటిని విక్రయించడం ద్వారా సమకూరే నిధులతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలనుకుంటోంది. వివిధ ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూములు దీర్ఘకాలంగా నిరుపయోగంగా ఉన్నట్లయితే వాటిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం...భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) ఆదేశాలిచ్చిన విషయం విదితమే.

వీటి అమ్మకం ద్వారా రూ.6,500 కోట్లు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల బడ్జెట్లోనూ ఈ అంశాన్ని పెట్టింది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూముల విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నిధులు సమకూర్చుకోవడమే గాక... అక్కడ వివిధ సంస్థల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలన్న ద్విముఖ వ్యూహంతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  ఆ భూముల వివరాలను ఇటీవల తెప్పించుకొంది. వీటిలో సింహభాగం హెచ్‌ఎండీఏకు చెందిన 3,500 ఎకరాలు...

>
మరిన్ని వార్తలు