ఓడిపోయిన రాజకీయ ప్రముఖుల కుమార్తెలు!

13 Jan, 2015 17:25 IST|Sakshi
ఓడిపోయిన రాజకీయ ప్రముఖుల కుమార్తెలు!

హైదరాబాద్: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలలో బీజేపీ, టీడీపీలకు చావుదెబ్బ తగిలింది. ఈ రెండు పార్టీలు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాయి. రాజకీయ ప్రముఖుల కుమార్తెలు ఓడిపోయారు. కంటోన్మెంట్ టీడీపీ ఎమ్మెల్యే జీ.సాయన్న,కాంగ్రెస్ సీనియర్ నేతలు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రి శంకర్రావు కుమార్తెలు ముగ్గురూ ఓడిపోయారు. 4వ వార్డు పికెట్లో పోటీ చేసిన  ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందితపై 844 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి నళిని కిరణ్ విజయం సాధించారు. 2వ వార్డు రసూల్ పురలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సర్వే సత్యనారాయణ కుమార్తె సుహాసినిపై టీఆర్ఎస్ అభ్యర్థి సదాకేశవ రెడ్డి 1534 ఓట్ల ఆధిక్యంతో  విజయం సాధించారు.

మొత్తం 8 వార్డులకు 114 మంది పోటీ చేశారు.  నాలుగు టీఆర్ఎస్, రెండు టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు గెలుపొందారు. రెబల్ అభ్యర్థి అనితా ప్రభాకర్ తాను టీఆర్ఎస్లోనే కొనసాగుతానని ప్రకటించారు. మిగిలిన రెండిటిలో ఒకటి కాంగ్రెస్, మరొకటి కాంగ్రెస్ రెబల్స్ గెలుచుకున్నారు. 1వ వార్డులో స్వతంత్రంగా పోటీ చేసిన టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి జక్కుల మహేశ్వరరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి జంపన ప్రతాప్పై 616 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 3 వార్డు కార్ఖానాలో టీఆర్ఎస్ అభ్యర్ధి జంపన విద్యావతిపై 2500 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి అనితా ప్రభాకర్ విజయం సాధించారు.

వార్డుల వారీగా గెలిచిన అభ్యర్థులు
1వ వార్డు మహేశ్వర రెడ్డి  (టీఆర్ఎస్ రెబల్)
2వ వార్డు కేశవరెడ్డి (టీఆర్ఎస్)
3వ వార్డు అనితా ప్రభాకర్ (టీఆర్ఎస్ రెబల్ )
4వ వార్డు నళినీ కిరణ్ (టీఆర్ఎస్)
5వ వార్డు మారేడ్పల్లి రామకృష్ణ (ఇండిపెండెంట్)
6వ వార్డు పాండు యాదవ్ (టీఆర్ఎస్)
7వ వార్డు తిరుమలగిరి భాగ్యశ్రీ(కాంగ్రెస్)
8వ వార్డు బొల్లారం లోకనాథం (టీఆర్ఎస్)

మరిన్ని వార్తలు