ఎల్పీజీ లింకేజీ తెలుసుకోవడం ఇలా...

7 Sep, 2013 02:35 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మీరు ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులా..! మీ ఎల్పీజీని ఆధార్, బ్యాంక్‌ఖాతాతో అనుసంధానానికి సంబంధి త పత్రాలను గ్యాస్ డీలర్, బ్యాంకర్లకు సమర్పించారా..!?అయినా  కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలెండర్ రీఫిల్లింగ్‌పై ఇచ్చే సబ్సిడీ రాయితీ రూ.558.30 పైసలు నగదురూపం లో బ్యాంక్ ఖాతాలో జమ కావడం లేదా..? దీంతో  రీఫిల్లింగ్ కొనుగోలుకు ప్రస్తుత మార్కెట్ ధర రూ. 1024.50 ను పూర్తిగా భరించాల్సి వస్తుందా.? డీలర్, బ్యాంకర్లను అడిగినా సరైన సమాధానం రావడం లేదా..?...అయితే అసలు మీ ఎల్పీజీ ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైనదో లేదో ఒక్కసారి  ఇంటర్నెట్‌లో పరిశీలించండి.
 
ఇలా: ఇంటర్నెట్ గూగుల్‌లో వెళ్లి  www.transparency portal indane gas  లేదా HP gas లేదా ఆజ్చిట్చ్ట జ్చట  అని టైప్ చేయండి. సంబంధిత గ్యాస్ పోర్టల్ సైట్ ఓపెన్ కాగానే అందులో రాష్ట్రం, జిల్లా, డిస్ట్రిబ్యూటర్ పేరు సెలక్ట్ చేసి ఎంటర్ కొట్టండి. కొన్ని కంపెనీలు ఆధార్  నంబర్‌ను అడుగుతాయి.  వాటి తర్వాత  కస్టమర్ నంబ ర్, పేరు, అడ్రస్  సూచించిన బాక్స్‌లో కంపో జ్ చేసి ఎంటర్ కొట్టండి. అప్పుడు మీ ఎల్పీజీ ఆధార్, బ్యాంక్ ఖాతాలలో అనుసంధానమైందా? లేదా ?అన్న స్టేటస్ రిపోర్టు రెండు వృత్తాల ద్వారా తెలుస్తుంది.

ఆకుపచ్చ వృత్తం ఆయితే అనుసంధానం ఆయినట్లు, ఎర్రరంగు వృత్తం వస్తే కానట్లు అర్థం చేసుకొవాలి.  ఆయిల్ కంపెనీ స్టేటస్ కింద ఆకుపచ్చ వృత్తం వచ్చి, బ్యాంక్ స్టేటస్  కింద వృత్తంలో ఎర్ర రంగు వృత్తం వస్తే  డీలర్ వద్ద అనుసంధానమైనట్లు, బ్యాంకులో కానట్లు అర్థం చేసుకొవాలి.

ఒకవేళ ఆయిల్‌కంపెనీ స్ట్టేటస్ కింద ఎర్ర రంగు వృత్తం వచ్చి, బ్యాంక్ స్టేటస్ కింద ఆకుపచ్చ వృత్తం వస్తే డీలర్ వద్ద ఆనుసంధానం కానట్లు, బ్యాంక్‌లో అనుసంధానంమైనట్లు గ్రహించాలి. ఒక వేళ రెండు వృత్తాలు ఆకుపచ్చగా వస్తే పూర్తిగా ఆయినట్లు, రెండు వృత్తాలు ఎర్రగా వస్తే డీలర్, బ్యాంకు ఖాతా కూడా లింకేజీ  కానట్లు అర్థం చేసుకొవాలి. తక్షణమే మరోసారి అనుసంధానికి ప్రయత్నించండి.
 

మరిన్ని వార్తలు