కొడుకుకు కలిసిరాదని కూల్చేస్తారా..?

2 Nov, 2016 02:02 IST|Sakshi
కొడుకుకు కలిసిరాదని కూల్చేస్తారా..?

సచివాలయం కూల్చివేతపై మధుయాష్కీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి కొడుకులు ముఖ్యమంత్రి కాలేదని, అల్లుళ్లకి కలసి వస్తుందనే కారణంతో సచివాలయాన్ని కూల్చివేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం సరైంది కాదని మాజీ ఎంపీ మధు యాష్కీ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

కొడుకును ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ సచివాలయాన్ని కూల్చేసే నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.  ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ తమ ఆస్తులు కాపాడుకోవడానికే పనిచేస్తున్నారన్నారు. జీహెచ్‌ఎంసీలో రూ.300 కోట్ల కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు