కేసీఆర్ కుల దురహంకారి: మధుయాష్కీ

12 Apr, 2016 04:04 IST|Sakshi
కేసీఆర్ కుల దురహంకారి: మధుయాష్కీ

సాక్షి, హైదరాబాద్: దళితజాతి మహనీయులను సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ, టీపీసీసీ ఎస్సీసెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్ విమర్శించారు. హైదరాబాద్‌లో సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్య్రం కోసం, అట్టడుగువర్గాల అభివృద్ధి కోసం పోరాడిన బాబూ జగ్జీవన్‌రామ్, జ్యోతిరావుపూలే జయంతి వేడుకలకు కేసీఆర్ దూరంగా ఉన్నారని విమర్శించారు. దళిత మహనీయులు, ప్రజల పట్ల కేసీఆర్‌కున్న చులకన భావానికి, కుల దురహంకారానికి ఇది నిదర్శనమన్నారు.

మరిన్ని వార్తలు