దైవసన్నిధానంలో మహాకుంభాభిషేకం ప్రారంభం

18 Jun, 2016 14:07 IST|Sakshi
దైవసన్నిధానంలో మహాకుంభాభిషేకం ప్రారంభం

ఫిల్మ్‌నగర్ దైవ సన్నిధానంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో ఈ కుంభాభిషేకం జరుగుతోంది. శనివారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ఈ అభిషేకం ఉంటుంది. ఈ ఐదు రోజులూ స్వరూపానందేంద్ర సరస్వతి ఇక్కడే ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని దైవసన్నిధానం వర్గాలు తెలిపాయి.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు, తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు కేవీ రమణాచారి, ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనూరాధ, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, దైవసన్నిధానం చైర్మన్, నటుడు మురళీమోహన్, హీరో చిరంజీవి భార్య సురేఖ తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు