నగరంతో నాది సంగీత అనుబంధం

15 Sep, 2015 10:56 IST|Sakshi
నగరంతో నాది సంగీత అనుబంధం

‘సాక్షి’తో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ
 
 
హైదరాబాద్ : ‘నగరంతో నాది సంగీత అనుబంధం.. భాగ్యనగర వాసులు సంగీత ప్రియులు.. బాగా ఆదరిస్తారు’ అని హైదరాబాదుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. సంగీత సరస్వతి ముద్దుబిడ్డ అయిన మంగళంపల్లి సోమవారం రవీంద్రభారతిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో ముచ్చటించారు.
 
మిగతా విషయాలతో కన్నా నాకు హైదరాబాద్‌తో నాకు సంగీత అనుబంధమే ఉంది.  ఎప్పటినుంచో ఇక్కడి వస్తున్నా..ప్రజలు నా సంగీతాన్ని విని ఆనందిస్తున్నారు. నన్ను అభిమానిస్తున్నారు.
 
యువత వెస్ట్రన్ సంగీతం విన్నా, ఆకర్షితులైనా, మరే సంగీతం వంటపట్టించుకున్నా  అన్ని సంగీతాలు మనవే. మన సంగీతం నుంచి పుట్టినవే అన్నీ. అన్ని రాగాలు మనవే. వెస్ట్రన్ సంగీతం అలవాటు పడ్డ వారు కూడా మన పిల్లలే కదా. ఎటు తిరిగి ఎటుపోయినా మళ్లీ శాస్త్రీయ సంగీతం దగ్గర ఆగాల్సిందే.
 
రోగాలు నయం చేసేందుకంటూ ప్రత్యేక పాటలు, సంగీతం అంటూ ఏమీలేవు..  సంగీతంతో కూడిన రాగాలు వింటూ ఉంటే రోగాలు వాటంతట అవే తగ్గిపోతాయి.  ఇప్పుడున్న పరిస్థితుల్లో శాస్త్రీయ సంగీగతం విన్నా, నేర్చుకున్నా మంచే జరుగుతుంది.  సంగీతప్రియులు ఇన్ని సంవత్సరాలు నన్ను ఆదరించి ప్రేమించారు. బాగా చూసుకున్నారు..  ఈ ఆదరాభిమానాలు నేను ఉన్నన్నాళ్లు లభించాలని కోరుకుంటున్నాను.

>
మరిన్ని వార్తలు