హైస్కూళ్లలో బాలికలకు మార్షల్‌ ఆర్ట్స్‌

23 Mar, 2017 02:01 IST|Sakshi
హైస్కూళ్లలో బాలికలకు మార్షల్‌ ఆర్ట్స్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 5,111 ఉన్నత పాఠశాలల్లో బాలికలకు మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. బాలికల్లో ఆత్మస్థైర్యా న్ని పెంచేందుకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌(ఆర్‌ఎంఎస్‌ఏ) కింద ఈ శిక్షణ ఇవ్వనుంది. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు ప్రారంభం కాగానే శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.

ఇందుకు ప్రత్యేక షెడ్యూల్‌ను జారీ చేయనుంది. ఒక్కో స్కూల్‌కు రూ.8,500 చొప్పున మొత్తం రూ.4.34 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. దీనికి సంబంధించి జిల్లాల వారీ వివరాలతో డీఈవో లకు ఆర్‌ఎంఎస్‌ఏ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యధికంగా నిజమాబాద్‌లో 277 స్కూళ్లలో, తక్కువగా కుమ్రం భీం జిల్లాలో 70 స్కూళ్లలో ఈ శిక్షణ ఇవ్వనుంది.

మరిన్ని వార్తలు