రేపు మెడికల్ షాపుల బంద్

13 Oct, 2015 17:48 IST|Sakshi
రేపు మెడికల్ షాపుల బంద్

హైదరాబాద్: ఆన్‌లైన్‌లో మందుల కొనుగోలు, విక్రయాలు సాగించే విధానాలను నిరసిస్తూ ఈ నెల 14న దేశవ్యాప్తంగా ఉన్న 8 లక్షల మందుల దుకాణాలు బంద్ పాటిస్తాయని తెలంగాణ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటపతి, గౌరవ కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి మధుసూదన్  ఒక ప్రకటనలో తెలిపారు.

 

ఆన్‌లైన్‌లో మందుల కొనుగోలు, అమ్మకాల వల్ల నిషా, నిద్ర మాత్రలతో యువతకు భారీ నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన డాక్టర్‌ను సంప్రదించకుండా పరిమితిలేని మందులను వాడటం వల్ల ఆరోగ్య నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే బంద్‌కు సహకరించాలని వారు కోరారు.

మరిన్ని వార్తలు