సినిమా చూడాలా.. బస్టాండ్కు వెళ్లండి!

21 Jun, 2016 23:16 IST|Sakshi
సినిమా చూడాలా.. బస్టాండ్కు వెళ్లండి!
  • మొదట గ్రేటర్ బస్టాండ్లలో అందుబాటులోకి
  • అనంతరం ఎంజీబీఎస్, జేబీఎస్ సహా అన్ని చోట్ల ఏర్పాటు

  • సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు వినోదభరితమైన కబురు... సరదాగా సినిమాకి వెళ్లాలనుకుంటున్నారా... ఇక మీరు సినిమాల కోసం ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లినా చాలు.. అవును, ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలే ఇక మినీ థియేటర్లుగా అవతరించనున్నాయి. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్‌లతో పాటు గ్రేటర్‌లోని అన్ని ప్రయాణ ప్రాంగణాల్లో మినీ థియేటర్లు రాబోతున్నాయి. హయత్‌నగర్, ఈసీఐఎల్, కాచిగూడ, కోఠి, కూకట్‌పల్లి, పటాన్‌చెరులలోని బస్‌స్టేషన్లలో మినీ థియేటర్లను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. పటాన్‌చెరులోని ప్రయాణ ప్రాంగణంలో త్వరలో మినీ థియేటర్‌ను ప్రారంభించనున్నారు.

    ఒక్కో థియేటర్‌లో 125 నుంచి 150 మంది వరకు కూర్చొనేలా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు అద్దెకు ఇచ్చిన తరహాలోనే మినీ థియేటర్లను కూడా అద్దెకు ఇస్తారు. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన సంస్థను గట్టెక్కించేందుకు టిక్కెట్‌పైన వచ్చే ఆదాయంపై మాత్రమే ఆధారపడకుండా ఇతర మార్గాలను సైతం అన్వేషించాలన్న సీఎం కేసీఆర్ సూచన మేరకు ఆర్టీసీ ఈ కార్యాచరణ చేపట్టింది. మొదట నగరంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మినీ థియేటర్లను అందుబాటులోకి తెచ్చిన అనంతరం మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్‌లలోనూ ఏర్పాటు చేస్తారు.

మరిన్ని వార్తలు