'సాగర్ ఆధునీకరణ పనులకు 8 ఏళ్లా?!'

30 Sep, 2016 18:35 IST|Sakshi

హైదరాబాద్: నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆధునీకరణ పనులు 8 ఏళ్లుగా కొనసాగుతుండటంపై నీటి పారుదల శాఖా మంత్రి హరీష్‌రావు విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సూచించారు. శుక్రవారం ఆ శాఖ అధికారులు ఆయనకు నివేదిక సమర్పించారు.

సాగర్ ఎడమ కాల్వ ఆధునీకరణలో భాగంగా ఏ ప్యాకేజీల పనులు ఏ మేరకు పూర్తయ్యాయో వివరించారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి కాగా మిగతా వాటిని వేగంగా చేస్తున్నట్లు చెప్పారు. ఎడమ కాల్వ అభివృధ్ధి కోసం ప్రపంచబ్యాంకు నిధులతో మొత్తం రూ.1,611 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పనులు పూర్తయితే ఎడమ కాల్వ కింద 1.50లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది.

మరిన్ని వార్తలు