3 దశల్లో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన

18 Feb, 2016 14:12 IST|Sakshi
3 దశల్లో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అధికార టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి దిశగా తొలి అడుగు పడింది. జీహెచ్ఎంసీ 100 రోజుల యాక్షన్ ప్లాన్ను మున్సిపల్, ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ యాక్షన్ ప్లాన్లోని అంశాలను వివరించారు.

► పెండింగ్లో ఉన్న రిజర్వాయర్లను త్వరలో పూర్తి
► యువత కోసం స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు
► హెచ్ఎమ్డీఎ టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు
► రూ.26 కోట్లతో 40 మోడల్ మార్కెట్లు ఏర్పాటు
► నగరంలో స్పోర్ట్స్కు ప్రోత్సాహం
► 150 జిమ్స్, 20 కాలనీ పార్కులు ఏర్పాటు
► ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అప్లికేషన్ల క్లియర్
► హుస్సేన్ సాగర్లోకి మురికి నీరు రాకుండా చేయడం
► మూడు దశల్లో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన
► చెత్త సేకరణను మరింత వేగవంతం  
► 25 కి.మీ. మేర వరల్డ్ క్లాస్ సైక్లింగ్ ట్రాక్
► నగర పంచాయతీల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు
► 32 వేల కొత్త నల్లా కనెక్షన్లు
► రూ.30 కోట్లతో నాలాల అభివృద్ధి.

మరిన్ని వార్తలు