కేటీఆర్ రేర్ సెల్ఫీ ఏంటో తెలుసా?

19 May, 2016 13:07 IST|Sakshi
కేటీఆర్ రేర్ సెల్ఫీ ఏంటో తెలుసా?

హైదరాబాద్ : తెలంగాణా ఐటీ శాఖామంత్రి  కల్వకుంట్ల తారక రామారావు చివరికి ఆ బిగ్ న్యూస్ ను రివీల్ చేశారు.  గురువారం నాడు ఒక బిగ్ న్యూస్ చెబుతానని, అది అప్పటివరకు సస్పెన్స్ అంటూ ఊరించిన మంత్రి  భాగ్యనగరంలో యాపిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ ప్రారంభంకావడమే  బిగ్ న్యూస్ అని  తేల్చేశారు.   హైదరాబాద్ లో యాపిల్  డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభం కావడం పట్ల ఐటీ శాఖా మంత్రి  ఆనందంలోమునిగి తేలుతున్నారు.  భారత పర్యటనలో ఉన్న యాపిల్ సీఈవో టిమ్‌కుక్‌  గురువారం హైదరాబాద్ లోని వేవ్ రాక్ భవనంలో  టెక్ సెంటర్ ను ప్రారంభించగా,   మంత్రి కేటీర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కేటీఆర్ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని పంచుకున్నారు.   ఈ సందర్భంగా తెలంగాణా ముఖ్యమంత్రి, తండ్రి, కేసీఆర్ సహా,  టిమ్ కుక్ తో తీసుకున్న అరుదైన  సెల్ఫీని మంత్రి ట్విట్టర్ లో షేర్ చేశారు. ఫ్రెంజీ ఔట్ సైడ్ వేవ్ రాక్ అంటూ మరికొన్ని ఫోటోలను  పోస్ట్ చేశారు. దీంతోపాటు యాపిల్  సంస్థ ఎంబ్లమ్  'యాపిల్' ను తమ పార్టీ  గులాబీ రంగుతో  పూర్తిగా నింపేసి  ఆశ్చర్యంలో ముంచెత్తారు.

అమెరికా తరువాత  అతి పెద్ద డెపలప్ మెట్ సెంటర్ కు హైదరాబాద్ వేదిక  అయిందని ట్విట్  చేశారు. గత  ఏడాది  మేనెలలో గూగుల్ వస్తే.. ఇపుడు  యాపిల్ హైదరాబాద్ కు తరలి వచ్చిందని కమెంట్ చేశారు. ప్రపంచంలో అతి విలువైన దిగ్గజ టెక్ కంపెనీలు అయిందింటిలో  యాపిల్ తో కలిపి   నాలుగు కంపెనీలు( గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్,  యాపిల్) కార్యాలయాను స్థాపించడం విశేషమని, ఇది  హైదరాబాద్ కు గర్వకారణమని కేటీర్ అన్నారు.

కాగా యాపిల్ ప్రాభవాన్ని తిరిగి పునరుద్ధరించే చర్యలో భాగంగా  టిమ్ కుమ్ భారత్ లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత ఆయన  ఈ ఉదయం భాగ్యనగరం చేరుకున్నారు. యాపిల్ సంస్థతో ప్రభుత్వంఎంవోయూ కుదుర్చుకున్న తరువాత  గురువారం మీకో పెద్ద వార్త చెబుతా అని ట్వీట్ చేయడంతో ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే.


మరిన్ని వార్తలు