కామెంట్ చేస్తారు కానీ...ఓటెందుకు వేయరు?

25 Jan, 2016 12:49 IST|Sakshi
కామెంట్ చేస్తారు కానీ...ఓటెందుకు వేయరు?

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆస్తులు లాక్కుంటుందని కొంతమంది అపోహలు సృష్టించారని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలోని కస్తూర్భా గాంధీ డిగ్రీ కాలేజీ వార్షికోత్సవ వేడుకలకు ఆయన సోమవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేడు జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ విద్యార్థినీలతో మొదటిసారి ఓటు రిజిస్టేషన్ చేయించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘటన తమదేనన్నారు.

ప్రజాస్వమ్యంలో ఓటు హక్కు ముఖ్యమైనదని ఆయన అన్నారు.  'హైదరాబాద్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఓటింగ్ శాతం తగ్గుతోంది. నగర ఓటర్లు నాయకుల్ని కామెంట్ చేస్తారు కానీ...ఓటు వేయరు.  మీరు డైరెక్ట్ పాలిటిక్స్ లోకి రావాలని అనడం లేదు. కానీ ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి రండి.  విద్యార్థులు ఉదాసీనంగా  ఉంటే దేశానికి మంచి నాయకులు రారు. నేను నా పార్టీకి ఓటు వేయమని అడుగుతా... మాకు ఓటు వేయకపోయిన పరవాలేదు...ఓటు హక్కు మాత్రం ఉపయోగించుకోండి' అని పిలుపునిచ్చారు.

>
మరిన్ని వార్తలు