మైనారిటీ బడ్జెట్ పది రెట్లు పెంచాలి

21 Sep, 2014 03:38 IST|Sakshi

14వ ఆర్థిక సంఘానికి ఎంపీ అసదుద్దీన్ లేఖ

సాక్షి,సిటీబ్యూరో: కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో మైనారిటీల సంక్షేమం, వివిధ పథకాల అమలుకు వార్షిక బడ్జెట్ కేటాయింపులను పది రెట్లు పెంచాలని కోరుతూ 14వ ఆర్థిక సంఘం కమిషన్ చైర్మన్ వైవీ రెడ్డికి మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శనివారం లేఖ రాశారు. మైనార్టీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, ఇటీవల జాతీయ మైనార్టీస్ కమిషన్, విద్యాసంస్థలు,జాతీయ శాంపిల్ సర్వే సంస్థలు చేసిన అధ్యయనాల్లో సైతం ఈ విషయం వెల్లడైందని గుర్తు చేశారు. ప్రధానమంత్రి 15 సూత్రాల పథకం కింద మైనారిటీలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాల ప్లాన్, నాన్‌ప్లాన్ కేటాయింపులు తగినంతగా ఉండాలన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్ మాదిరిగా బీసీ, మైనార్టీల కోసం ప్రత్యేక సబ్ ప్లాన్ రూపొందించాలని తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు