మిషన్ కాకతీయకు రూ.2,255 కోట్లు

15 Mar, 2016 02:34 IST|Sakshi
మిషన్ కాకతీయకు రూ.2,255 కోట్లు

గత ఏడాదితో పోలిస్తే కాస్త ఎక్కువే
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పథకానికి ప్రభుత్వం ఈ ఏడాది ఆశించిన స్థాయిలోనే నిధులను కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.172 కోట్ల మేర అదనపు కేటాయింపులు చేసి మొత్తంగా రూ.2,255 కోట్లు కేటాయింపులు జరిపింది. ఈ నిధులతో సుమారు 9 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించనుంది. ఇందులో చిన్న నీటి చెరువుల పునరుద్ధరణకు రూ.1,410.15 కోట్లు కేటాయించగా, ఇదే మిషన్ కాకతీయలో పెద్దతరహా పనులైన మినీ ట్యాంక్‌బండ్‌లు ఇతర చెరువుల కోసం రూ.737.93 కోట్లు కేటాయించారు.

ఇందులో సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద రూ.100 కోట్లు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృధ్ధి నిధి (ఆర్‌ఐడీఎఫ్) కింద రూ.5 కోట్లు, ట్రిపుల్ ఆర్ కింద మరిన్ని నిధులు వస్తాయని అంచనా వేసింది.

మరిన్ని వార్తలు