రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి

13 Nov, 2016 02:28 IST|Sakshi
రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి

హైకోర్టులో ఎమ్మెల్సీ రామచంద్రరావు పిల్  
సాక్షి, హైదరాబాద్: రాజధానితో పాటు తెలంగాణలో రోడ్ల దుస్థితిపై బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. రాష్ట్రంలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని, వెంటనే వీటి మరమ్మతులు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు.

ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించనుంది. ఇటీవలి వర్షాలకు రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని, వీటిపై వెళ్లాలంటే వాహనదారులకు నరకం కనిపిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ గుంతల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డారని తెలిపారు. రోడ్లను వేసే సమయంలో నాణ్యత పాటించడం లేదని, నాసిరకం మెటీరియల్‌ను వాడటం వల్ల తక్కువ కాలానికే దెబ్బతింటున్నాయన్నారు. ఇవికాక విద్యుత్, సీవరేజీ, నీటి అవసరాల నిమిత్తం రోడ్లను తవ్వేస్తున్నారని, వాటికి తిరిగి రిపేర్లు చేయడం లేదని వివరించారు. 

మరిన్ని వార్తలు