పరీక్ష కేంద్రం గుర్తింపునకు మొబైల్ యాప్

8 Nov, 2016 04:08 IST|Sakshi
పరీక్ష కేంద్రం గుర్తింపునకు మొబైల్ యాప్

- హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేయగానే పరీక్ష కేంద్రం గుర్తింపు
- అందుబాటులోకి రూట్ మ్యాప్ రూపొందించిన టీఎస్‌పీఎస్సీ
 
 సాక్షి, హైదరాబాద్: పరీక్ష కేంద్రం ఎక్కడుందోనని ఆందోళన చెందుతున్నారా? ఎలా వెళ్లాలో మార్గం తెలియదని ఆలోచిస్తున్నారా? ఇకపై ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే టీఎస్‌పీఎస్సీ ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెస్తోంది. దాని సహాయంతో పరీక్ష కేంద్రం ఎక్కడుందో ఇట్టే తెలుసు కోవచ్చు. ప్రస్తుతం గ్రూపు-2 రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం యాప్‌ను రూపొందించింది. స్మార్ట్ ఫోన్లు కలిగిన వారు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతే కాదు ఈ యాప్‌తో హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, పరీక్ష కేంద్రం రూట్ మ్యాప్‌ను కూడా జీపీఎస్ సాయంతో పొందవచ్చు. ఇప్పటివరకు టీఎస్‌పీఎస్సీ నిర్వహించే రాత పరీక్షలకు హాజరయ్యే వారికి అందజేసే హాల్ టికెట్లలో పరీక్ష కేంద్రం ఎక్కడుం ది? ఏ జిల్లా, ఏగ్రామం, కేంద్రం పేరు మాత్రమే ముద్రిం చి ఉండేవి. ఈనెల 11, 13 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,916 కేంద్రాల్లో జరిగే గ్రూపు-2 రాత పరీక్షకు 7,89,985 మంది అభ్యర్థులు హాజరు కానున్నా రు. వారంతా మొబైల్ యాప్ సేవలను పొందేలా టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది.

 ఇంటర్మీడియెట్ పరీక్షలకు కూడా...: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కూడా మొబైల్ యాప్ సేవలను అందుబా టులోకి తెచ్చేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే దాదాపు 10 లక్ష ల మంది విద్యార్థులకు ఈ యాప్‌ను అందుబాటు లోకి తేవాలని యోచిస్తోంది.  దీంతో వారు పరీక్ష కేంద్రాన్ని సులభంగా కనుక్కునేలా, రూట్‌ను తెలుసుకునేలా ఉండాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణపైనా బోర్డు దృష్టి సారించింది.

మరిన్ని వార్తలు