మోదీని ఉరి తీయాలి

22 Nov, 2016 00:55 IST|Sakshi
మోదీని ఉరి తీయాలి

ఆర్బీఐ కార్యాలయం ఎదుట నారాయణ ధర్నా

 సాక్షి, హైదరాబాద్: ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడంపై సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ మండి పడ్డారు. కరెన్సీ నోటుపై ఇంత మొత్తానికి హామీ ఇస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్ సంతకంతో ఉంటుందని, అలాంటి నోటును రద్దు చేసిన మోదీని నడివీధిలో ఉరితీసినా తప్పులేదన్నారు.  గాంధీజీ బొమ్మ ఉన్న కరెన్సీని చిత్తు కాగితంగా మార్చి అవమానించినందుకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సోమవారం హైదరాబాద్ సైఫాబాద్‌లోని రిజర్వ్‌బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎదుట నారాయణ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు రవీంద్రభారతి నుంచి రిజర్వ్ బ్యాంక్ వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. నోట్ల రద్దుపై ఆర్‌బీఐ అధికారులతో మాట్లాడేం దుకు వచ్చామంటూ నారాయణ కార్యాలయం లోకి వెళ్లారు. తర్వాత అధికారులకు ఒక వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరుుదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారే తప్ప ప్రజలపై ప్రేమతో కాదన్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు