చాయ్‌కీ పైసల్లేవ్...

12 Dec, 2016 14:55 IST|Sakshi
చాయ్‌కీ పైసల్లేవ్...

బ్యాంకులో క్యూలో నిల్చోలేక.. ఓ పక్కన కూర్చొని ఆగ్రహంతో చూస్తున్న ఈ వృద్ధురాలి పేరు హనుమమ్మ. వయసు 75 సంవత్సరాలు. బంజారాహిల్స్ నందినగర్‌లో ఉంటోంది. నెలవారీగా తీసుకునే రూ.వెరుు్య పింఛన్ డబ్బుల కోసం ఆమె గత ఐదురోజులుగా స్థానిక ఆంధ్రా బ్యాంకు చుట్టూ తిరుగుతోంది. కానీ నగదు లేదంటూ బ్యాంకు సిబ్బంది పింఛన్ డబ్బులు ఇవ్వడం లేదు.

దీంతో మంగళవారం ఉదయం దిక్కుతోచక బ్యాంకులోనే కూర్చుండి పోరుుంది. ‘ఇంట్లో బియ్యం లేవు. సరుకుల్లేవ్. కనీసం చాయ్ తాగేందుకు కూడ పైసల్లేవ్ బిడ్డా...  ఎట్ల బతకాలే’ అంటూ వాపోరుుంది... ఇది హనుమమ్మ ఒక్కరి సమస్యే కాదు.. పెద్ద నోట్ల రద్దు కారణంగా నగరంలో లక్షలాది మంది నిరుపేదలు ఇలాంటి ఇక్కట్లే ఎదుర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు