కనగానపల్లె ఎంపీపీ ఎన్నికను రద్దు చేయండి

29 Dec, 2016 01:46 IST|Sakshi

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ

సాక్షి, హైదరాబాద్‌: అనంతపురం జిల్లా కనగానపల్లె మండల ప్రజాపరిషత్‌ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికను రద్దు చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి  పరిటాల సునీత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన పేర్కొంటూ.. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని పరిశీలించి ఎంపీపీ ఎన్నికను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఆయన లేఖ రాశారు.

ఈ నెల14న జరిగిన ఎంపీపీ ఎన్నిక సమయంలో దివంగత నేత పరిటాల రవిని దృష్టిలో పెట్టుకుని పద్మ గీతకు ఓటేయాలని కోరినట్లుగా సాక్షాత్తూ మంత్రి సునీత మీడియా సమావేశంలో వెల్లడించారని విజయ సాయిరెడ్డి గుర్తు చేశారు. 11 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను కేవలం నలు గురు సభ్యులే పద్మ గీతకు అనుకూలంగా చేతులెత్తారని, ఈ దృశ్యాలన్నీ వీడియో ఫుటేజీలో ఉన్నాయని చెప్పారు.

>
మరిన్ని వార్తలు