‘మల్టీ’ టాస్క్‌!

26 Jul, 2016 23:30 IST|Sakshi
నెక్లెస్‌ రోడ్డు స్టేషన్‌

► ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో బహుళ అంతస్థుల భవనాలు
►  మల్టీప్లెక్స్‌ థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌
►  ఏటా రూ.250 కోట్లకు పైగా ఆదాయం
►  రైల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రణాళికలు


సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్‌ స్టేషన్లు ఇక వాణిజ్య భవన సముదాయాలుగా అవతరించనున్నాయి. రవాణాతో పాటు సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్, షాపింగ్‌ కేంద్రాలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. రైలు ప్రయాణికులతో పాటు సందర్శకులకు చక్కటి వినోదం, షాపింగ్‌ సదుపాయాన్ని అందజేయనున్నాయి. ప్రయాణికుల టిక్కెట్లపై వచ్చే ఆదాయం మాత్రమే కాకుండా... రైల్వే స్థలాలను వాణిజ్య కార్యకలాపాలకు లీజుకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాల్లోని రైల్వే స్థలాలపై సమగ్ర సర్వే చేసిన రైల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వీటి అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించింది. నగరంలోని ప్రధాన  ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్లకు ఆనుకొని ఉన్న స్థలాల లీజుతో ఏటా రూ.250 కోట్లకు పైగా ఆదాయం లభించగలదని అంచనా వేసింది. అధికారులు ఈ దిశగా కార్యాచరణకు సన్నద్ధమవుతున్నారు.


అంతా లీజు బేరమే...
ఒక్కొక్క రైల్వే స్టేషన్‌లో దక్షిణ మధ్య రైల్వేకు అందుబాటులో ఉన్న స్థలాన్ని గుర్తించి వ్యాపార సంస్థలకు 45 ఏళ్లకు లీజుకు ఇవ్వాలని రైల్వే ల్యాండ్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సూచిం చింది. దేశవ్యాప్తంగా రైల్వే స్థలాలపై సర్వేలు నిర్వహించి, వాటి అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించే ఈ  సంస్థ (రైల్వేకు అనుబంధంగా పని చేస్తుంది.) ప్రతినిధుల బృందం ఇటీవల నగరంలో విస్తృతంగా పర్యటించింది. నిత్యం పర్యాటకులు, సందర్శకులతో రద్దీగా ఉండే నెక్లెస్‌ రోడ్డు, సంజీవయ్య పార్కు రైల్వేస్టేçషన్‌లతో పాటు, బేగంపేట్, ఖైరతాబాద్, లకిడీకాపూల్‌ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌లలోని రైల్వే స్థలాలను  వాణిజ్య సముదాయాలుగా అభివృద్ధి చేయవచ్చునని సూచించింది.

 

రైల్వే ల్యాండ్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అందించినlవివరాల ప్రకారం సంజీవయ్య పార్కు స్టేషన్‌కు ఆనుకొని సుమారు ఎకరా స్థలం ఉంది. దీన్ని లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.45 కోట్లు  లభిస్తుంది. నెక్లెస్‌ రోడ్డు స్టేషన్‌ వద్ద ఉన్న ఎకరంపై మరో రూ.60 కోట్లు ఆర్జించవచ్చు. బేగంపేట్‌ రైల్వేస్టేషÙన్‌ ప్రాంతంలో 2 వేల గజాలు ఉంది. ఖైరతాబాద్, లకిడీకాపూల్‌ స్టేషన్‌లలో ఒకటిన్నర ఎకరం ఉన్నట్లు అంచనా. ఒక్కో స్టేషన్‌లో రైల్వే స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు లభిస్తుంది. ఈ ఐదు స్టేషన్లలోని స్థలాలను లీజుకు ఇవ్వగలిగితే రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు  లభించగలదని రైల్వే ల్యాండ్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రాథమిక అంచనా. రెండో దశలో సనత్‌ నగర్, హైటెక్‌ సిటీ, లింగంపల్లి, బోరబండ, నేచర్‌క్యూర్‌ తదితర స్టేషన్లను ఆనుకొని ఉన్న స్థలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు