నా భర్తే నా ఫేవరెట్

20 Aug, 2014 23:59 IST|Sakshi
నా భర్తే నా ఫేవరెట్

టైం దొరికితే బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు చూస్తానంటున్న మనాశెట్టి.. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే మాత్రం భర్త సునీల్‌శెట్టి పేరు ఠక్కున చెప్పేసింది. సినిమాలో డిఫరెంట్ రోల్స్ చేసిన సునీల్‌శెట్టి.. రియల్ లైఫ్‌లో ఫ్యామిలీతో చాలా క్లోజ్‌గా ఉంటాడని చెప్పుకొచ్చింది. నగరంలోని తాజ్ డెక్కన్ హోటల్‌లో బుధవారం జరిగిన అరాయిశ్ ఎగ్జిబిషన్‌లో ‘సేవ్ ద చిల్డ్రన్ ఇండియా స్టాల్’ను ఏర్పాటు చేసిన  మనాశెట్టితో ‘సిటీప్లస్’ ముచ్చటించింది.
 
అరాయిష్ ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన  ‘సేవ్ ద చిల్డ్రన్ ఇండియా స్టాల్’ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద పిల్లల చదువు కోసమే వెచ్చిస్తామన్నారు మనాశెట్టి.

‘హైదరాబాద్‌కు రావడం ఇది ఫోర్త్ టైం. ఈసారి స్టాల్‌లోని డిజైనింగ్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. హైదరాబాదీలకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ’ని కొనియాడింది. ‘మా అమ్మ 25 ఏళ్ల క్రితం స్థాపించిన ‘సేవ్ ద చిల్డ్రన్  ఇండియా’కు విరాళాల కోసమే ఈ స్టాల్‌ను ఏర్పాటు చేశాన’ని తెలిపింది.
 
టేస్ట్ అదుర్స్..
‘నగరానికి వచ్చిన ప్రతిసారీ ఇక్కడి వంటకాల రుచులు చూడందే వెళ్లం. ఇక్కడి స్పైసీ ఫుడ్ టేస్ట్ అదుర్స్. చారిత్రక కట్టడాలను కూడా సందర్శిస్తాన’ని వివరించింది మనా. తన కుమార్తె అతియా శెట్టి హిందీ సినిమాల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రోత్సాహం ఉంటుందని చెప్పింది.  కెరీర్  పరంగా అతియాకు సునీల్ కూడా మంచి గెడైన్స్ ఇస్తున్నారని చెప్పుకొచ్చింది.
 
రెస్పాన్స్ సూపర్బ్
‘అరాయిష్ ఎగ్జిబిషన్ ఈసారి బాగుంది. గతేడాదితో పొల్చుకుంటే ఈసారి డిఫరెంట్ డిజైనర్లు  రూపొందించిన లేడీస్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి.ఎగ్జిబిషన్‌కు స్థానిక మహిళల నుంచి మంచి స్పందన వస్తోంది. వందలాది మంది రావడం చూస్తుంటే సిటీ లేడీస్ డ్రెస్సింగ్‌కు ఇచ్చే ఇంపార్టెన్స్ ఎంతో  కనబడుతోంది. సో థ్యాంక్స్ టూ హైదరాబాదీస్’ అంటూచిట్‌చాట్ ముగించింది.

మరిన్ని వార్తలు